KCR: కాసేపట్లో ముంబైకి సీఎం కేసీఆర్

KCR: మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేతో భేటీ కానున్న కేసీఆర్.

Jyothi
Updated on: 20 Feb 2022 11:22 AM IST
KCR To Meet Maharashtra CM Uddhav Thackeray
X

KCR: కాసేపట్లో ముంబైకి సీఎం కేసీఆర్

KCR: తెలంగాణ ముఖ్యమంత్రి ముంబై వెళుతున్నారు. కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు మద్దతు కూడగట్టేందుకు కేసీఆర్ ముంబైలో పర్యటిస్తున్నారు. మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్దవ్ థాక్రేతో కేసీఆర్ భేటీ కానున్నారు. సీఎం కేసీఆర్ వెంట కేకే, ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి ఉన్నారు. దేశంలోని తాజా రాజకీయ పరిణామాలు, బీజేపీ వ్యతిరేక కూటమిపై నేతలు చర్చించనున్నారు. భోజనాల అనంతరం కేసీఆర్ బృందం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసానికి వెళ్లనున్నారు. కేసీఆర్ ముంబై పర్యటన సందర్భంగా ఘన స్వాగతానికి భారీ ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా హోర్డింగ్‌లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్టు నుంచి ఉద్దవ్ థాక్రే నివాసం వరకు భారీ హోర్డింగ్‌లు వెలిసాయి.


Jyothi

Jyothi

Next Story