Top
logo

కాసేపట్లో సిద్దిపేటకు సీఎం కేసీఆర్

కాసేపట్లో సిద్దిపేటకు సీఎం కేసీఆర్
X
Highlights

కాసేపట్లో సీఎం కేసీఆర్‌ సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా 1200 కోట్లతో చేపట్టిన అభివృద్ధి...

కాసేపట్లో సీఎం కేసీఆర్‌ సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా 1200 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. సిద్దిపేట శివారులో ఏర్పాటు చేయనున్న ఐటీ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం పొన్నాలలో కొత్తగా నిర్మించిన తెలంగాణ భవన్‌ను ప్రారంభిస్తారు. తర్వాత మిట్టపల్లిలో నూతనంగా నిర్మించిన రైతు వేదికను ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్.

ఇక మధ్యాహ్నం ఎన్సాన్‌పల్లిలో ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనానికి శంకుస్థాపన చేస్తారు. ఈ ఆస్పత్రిని 960 పడకల సామర్థ్యంతో నిర్మించనున్నారు. అనంతరం సిద్దిపేటలోని కోమటి చెరువు, నెక్లెస్‌ రోడ్డును పరిశీలిస్తారు. రోడ్డు పరిశీలన తర్వాత నర్సాపూర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. 163 కోట్లతో ఈ డబల్ బెడ్‌ రూమ్ ల సముదాయాన్ని నిర్మించారు. ఈ ప్రాంతానికి కేసీఆర్‌ నగర్‌ అని నామకరణం చేశారు. తొలి విడతలో 1,341 ఇళ్లు, రెండో విడుతలో వెయ్యి ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం 1.20 గంటలకు చింతల్‌ చెరువు వద్ద తొలివిడత భూగర్భ మురుగుపారుదల వ్యవస్థను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొంటారు.

Web TitleKCR to lay stone for IT tower in Siddipet
Next Story