ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం.. జిల్లాల వారీగా పంటల మ్యాప్‌..

ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం.. జిల్లాల వారీగా పంటల మ్యాప్‌..
x
Highlights

హైదరాబాద్ ప్రగతి భవన్ లో ఇవాళ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగు విధానంపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం...

హైదరాబాద్ ప్రగతి భవన్ లో ఇవాళ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగు విధానంపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో జిల్లాల వారీగా సాగు చేయాల్సిన పంటలపై అధికారులంతా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఏయే జిల్లాలలో ఏయే పంటలు వేయాలి, ఎంత మొత్తంలో వేయాలి అనే అంశంపై చర్చిస్తారు. వరిలో ఏ రకం విత్తనం ఎక్కడ, ఎంత వేయాలి? అనే అంశాలను ఖరారు చేయనున్నారు. అధికారులందరూ జిల్లాల వారీగా పంటల మ్యాప్‌ను రూపొందించనున్నారు.

సమావేశంలో ఈ పంటల మ్యాప్‌పై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ప్రగతి భవన్ లో సీఎం నిర్వహించే సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు హాజరు కానున్నారు. పసుపు 1.20 లక్షల ఎకరాల్లో, మిర్చి 2 లక్షల ఎకరాల్లో, వరి 40 లక్షల ఎకరాల్లో, 70 లక్షల ఎకరాల్లో పత్తి, కంది 15 లక్షల ఎకరాల్లో, కూరగాయలు 2 లక్షల ఎకరాల్లో, సోయాబీన్‌ 3 లక్షల ఎకరాల్లో వేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. మక్క పంటను యాసంగిలో మాత్రమే వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories