నేషనల్ పాలిటిక్స్‌ను టార్గెట్ చేసిన కేసీఆర్

నేషనల్ పాలిటిక్స్‌ను టార్గెట్ చేసిన కేసీఆర్
CM KCR: సరికొత్త పార్టీని ఏర్పాటు చేసి చక్ర తిప్పాలనే యోచనలో కేసీఆర్
CM KCR: గులాబీ బాస్ కేసీఆర్ హస్తినవైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ గద్దెపై కన్నేసి పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం చేసి విజయవంతమైనా కేసీఆర్.. రాష్ట్ర సాధనలో చాంపియన్ అయ్యారు. ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలకం కావాలని భావిస్తున్నారు. కొద్ది సవంత్సరాలుగా ఇదే విషయంపై కసరత్తులు చేస్తున్నారు. విభిన్న రంగాల ప్రముఖులతో జాతీయ స్థాయి కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారు. అప్పుడప్పుడు జాతీయ రాజకీయ విషయాలపై లీకేజీలు ఇస్తూ వచ్చారు.
కొద్ది సంవత్సరాలుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు గులాబీ బాస్. దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. పలు ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని ఆయన టార్గెట్ చేశారు. ఈ రెండు పార్టీలతో దేశానికి నష్టమని చెబుతూ వస్తున్నారు. దీంతో కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరమని భావిస్తున్న గులాబీ బాస్ కేసీఆర్.. తన పొలిటికల్ గేమ్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేజీపీకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ పనిచేయడం లేదని ఆరోపిస్తున్నారు. బీజేపీని ఢీకొట్టి జాతీయ స్థాయిలో తన సత్తా చాటాలని కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారు. ఇందులో భాగంగా సరికొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేసి చక్రం తిప్పాలని యోచిస్తున్నారు. మంచి ముహూర్తం చూసుకొని ఈ నెలాఖరులో ఢిల్లీ వేదికగా కొత్త జాతీయ పార్టీని ప్రకటిస్తారనే చర్చసాగుతోంది.
టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా ప్రకటించాలని ప్రతిపాదన వచ్చినప్పటికీ.. కొత్త పార్టీ ఏర్పాటుకే సీఎం కేసీఆర్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీకి.. జై భారత్ , నయా భారత్, భారత్ రాష్ట్రీయ సమితి వంటి పేర్లు పరిశీలనలో పెట్టారు కేసీఆర్. అందులో భారత్ రాష్ట్రీయ సమితి పేరు వైపు కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు తెలిస్తోంది. త్వరలోనే ఈ పేరును ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించనున్నట్లు సమాచారం. కారు గుర్తును సైతం అడిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే నెలలో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యకర్గ సమావేశాలు జరగనున్నాయి. ఐతే ఈ సమావేశానికంటే ముందే.. జాతీయ పార్టీని ప్రకటించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట.
కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలన్న నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చిస్తున్నారు. దేశంలో మరో కొత్త పార్టీకి స్కోప్ ఉందా.. కేసీఆర్ జాతీయ స్థాయిలో రాణించగలరా అన్న చర్చ సాగుతోంది. అసలు జాతీయ పార్టీ పెట్టాలన్న నిర్ణయం వెనుక కేసీఆర్‌కు ఉన్న ధైర్యం ఏంటి? ఇటీవల కాలంలో కేసీఆర్ పలు ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే ఆయన ముందుకు అడుగు వేశారని అంటున్నారు. అయితే వీళ్లలో ఎంతమంది కేసీఆర్ కు చివరి వరకు మద్దతుగా ఉంటారన్నది అనుమానమే.
మొత్తానికి జాతీయ పార్టీ పెట్టాలన్న కేసీఆర్ నిర్ణయంపై సర్వత్ర విభిన్న చర్చసాగుతోంది. రాష్ట్రం విడిచి కేసీఆర్ హస్తిన వెళ్లే అక్కడి ఉత్తరాది ప్రజల ఆదరిస్తారా లేదా అన్నది చూడాలి.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMT
CM Jagan: అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్.. స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక...
12 Aug 2022 9:43 AM GMTMacherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం మూవీ రివ్యూ..
12 Aug 2022 9:29 AM GMTమునుగోడు ఉపఎన్నికపై గులాబీ బాస్ ఫోకస్..
12 Aug 2022 8:38 AM GMTAirasia: స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక ఆఫర్.. రూ. 1475కే విమానంలో...
12 Aug 2022 8:05 AM GMTHanu Raghavapudi: హను రాఘవపూడి మీద కురుస్తున్న ఆఫర్ల వర్షం
12 Aug 2022 7:42 AM GMT