CM KCR: విపక్షాల ఊహకందని కేసీఆర్ వ్యూహరచన.. త్వరలో ఎన్నికల ప్రచారంలోకి గులాబీ దళపతి

CM KCR: తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలను వివరిస్తు్న్న బీఆర్ఎస్ నేతలు

Shekhar G
Published on: 18 Aug 2023 10:39 AM IST
KCR Strategy Was Unexpected By The Opposition
X

CM KCR: విపక్షాల ఊహకందని కేసీఆర్ వ్యూహరచన.. త్వరలో ఎన్నికల ప్రచారంలోకి గులాబీ దళపతి 

CM KCR: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ప్రచారంలో జోరు పెంచి దూసుకుపోతుంది. త్వరలో ఎన్నికల ప్రచారంలోకి దళపతి కేసీఆర్ కూడా దిగనున్నారు. సీట్ల కేటాయింపు, టికెట్ దక్కని వారిని ఎలా బుజ్జగించాలన్న యోచనలో విపక్షాలు ఉంటే.. కేసీఆర్ మాత్రం చాపకింద నీరులా ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశారు. విపక్షాల ఊహకందకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు, కవితలు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. విపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వరుస సభలు, సమావేశాలు నిర్వహిస్తూ కేడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story