రాష్ట్ర అభివృద్ధి కోసమే అప్పులు చేశాం.. ఇంకా చేస్తాం: కేసీఆర్

రాష్ట్ర అభివృద్ధి కోసమే అప్పులు చేశాం.. ఇంకా చేస్తాం: కేసీఆర్
x
Highlights

తెలంగాణ శాసనసభ సమావేశాలు చివరిరోజు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేతలకు ఏం మాట్లాడాలో కూడా ఆర్థం కావడం లేదని, హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికపై కాంగ్రెస్‌ అడ్డగోలుగా మాట్లాడుతోందని కేసీఆర్ మండిపడ్డారు.రాష్ట్ర అభివృద్ధి కోసమే అప్పులు చేశామని, అవసరమైతే ఇంకా చేస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ శాసనసభ సమావేశాలు చివరిరోజు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్‌ఆర్సీపై కేంద్ర నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. ఎన్‌ఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేతలకు ఏం మాట్లాడాలో కూడా ఆర్థం కావడం లేదని, హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికపై కాంగ్రెస్‌ అడ్డగోలుగా మాట్లాడుతోందని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ బలం 21 నుంచి 9కి పడిపోయిందని, బీజేపీ సంఖ్యాబలం 5నుంచి 1కి పడిపోయిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే అప్పులు చేశామని, అవసరమైతే ఇంకా చేస్తామని స్పష్టం చేశారు.

ముస్లిం రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేశారు. ముస్లిం రిజర్వేషన్లపై టీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టంగా ఉందని, మైనార్టీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వమే నానుస్తోందని విమర్శించారు. ముస్లింల రిజర్వేషన్లపై అవసరమైతే మరోసారి తీర్మానం చేస్తామన్నారు. పాతబస్తీలో కూడా మెట్రో పనులు జరుగుతున్నాయని త్వరలోనే పనులు పూర్తి అవుతాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న 40 ఏళ్లుగా ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తి కాలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పూర్తి చేసి చూపించామన్నారు. కాళేశ్వరంతో 45 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని కేసీఆర్‌ పేర్కొన్నారు.

అంతకముందు శాసనసభలో కీలక బిల్లును సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. 2017-2018 ఆర్థిక సంవత్సరంలో కాగ్ రిపోర్టును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ద్రవ్య మినియయ బిల్లును సీఎం ప్రవేశపెట్టారు. ఆ బిల్లుపై అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర అప్పులు రూ.1,42,000 కోట్ల కాగా రెవెన్యూ రాబడితో పోలిస్తే వడ్డీ చెల్లింపులు 12.19 శాతం, అలాగే వచ్చే ఏడేళ్లలో చెల్లించాల్సిన అప్పులు రూ. 65,740 కోట్లుగా ఉందని ఆ నివేదికలో పొందుపరిచివుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories