KCR Review: నేడు పంటల సాగుపై సీఎం కేసీఆర్ సమీక్ష

KCR Review Meeting on Crop Cultivation Today 02 10 2021
x

KCR: సాగుపై సీఎం కేసీఆర్ సమీక్ష

Highlights

*వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు, నిపుణులతో సమీక్ష *వ్యవసాయాన్ని తగ్గించాలని ప్రభుత్వం యోచన

KCR Review: పంటల సాగుపై మధ్యాహ్నం 2గంటలకు సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తారు. నిన్న యాసంగి పంటల ప్రణాళికపై మంత్రి నిరంజన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఇక ఏఏ ప్రాంతాలలో ఏఏ పంటలు వేయాలి? వరికి ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేస్తే రైతులకు ఉపయోగం ? మార్కెట్‌లో పంటలకు డిమాండ్ ఎలా ఉంది ? వంటి వాటిపై మార్కెటింగ్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ సీఎం కు సూచనలు ఇవ్వనుంది. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తుది నివేదిక అందజేయనుంది వ్యవసాయ శాఖ. యాసంగి పంటల ప్రణాళిలను ఖరారు చేయనున్నారు కేసీఆర్.

ఈ సారి ఇతర పంటలను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే సీజన్లలో రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల వరి వ్యవసాయాన్ని తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈసారి క్లస్టర్ వ్యూహాన్ని అనుసరించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐదు ప్రత్యామ్నాయ పంటలైన పచ్చిశనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, బెంగాల్ గ్రామ్‌లపై దృష్టి సారించింది వ్యవసాయ శాఖ. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే సమీక్షలో సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories