CM KCR: ఇవాళ సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లిలో కేసీఆర్‌ సభలు

CM KCR: ఇవాళ్టితో ముగియనున్న కేసీఆర్‌ రెండో విడత సభలు

Jyothi
Published on: 8 Nov 2023 9:26 AM IST
KCR Meetings in Sirpur, Asifabad and Bellampalli  Today
X

CM KCR: ఇవాళ సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లిలో కేసీఆర్‌ సభలు

CM KCR: ప్రచార జోరులో గులాబీ సారు దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్‌పై జడివానలా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజా ఆశీర్వాద సభల పేరుతో అధికార బీఆర్ఎస్‌ సుడిగాలి ప్రచారం చేస్తోంది. గులాబీ బాస్ కేసీఆర్ మూడోసారి అధికారమే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగానే కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలను చుట్టేస్తూ విపక్షాలను ఎండగడుతున్నారు.

ఇవాళ సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లిలో ప్రజా ఆశీర్వాద సభలలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఇవాళ్టితో కేసీఆర్ రెండో విడత సభలు ముగియనున్నాయి. మళ్లీ ఈనెల 13 నుంచి కేసీఆర్ మూడో పర్యటనలు ప్రారంభమవుతాయి. ఇక సీఎం కేసీఆర్.. రేపు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి కేసీఆర్‌ పోటీ చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story