ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం

Arun Chilukuri
Published on: 28 Feb 2021 3:57 PM IST
ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం
X

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రంగారెడ్డి, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికపై సమీక్ష నిర్వహించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలను, ప్రచార శైలిని వివరించారు. ప్రస్తుతం, నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల మంత్రులతో సీఎం కేసీఆర్‌ మీటింగ్ నిర్వహిస్తున్నారు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా మంత్రులకు ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. అలాగే, ఎన్నికల ప్రచార శైలి, వ్యూహాలపై మంత్రులు, పార్టీ ముఖ్యనేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఆయా జిల్లాల మంత్రులకే కాకుండా ఇతర మంత్రులకు కూడా నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలను అప్పగించారు సీఎం కేసీఆర్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story