కేటీఆర్, కవితలకు కీలక పదవులు.. ప్లీనరీలో కేసీఆర్..

TRS Plenary: టీఆర్ఎస్‌లో ఆవిర్భావ జోష్ కన్పిస్తోంది.

Arun Chilukuri
Updated on: 19 April 2022 8:30 PM IST
KCR Likely to Announce key Posts to KTR and Kavitha at Plenery
X

కేటీఆర్, కవితలకు కీలక పదవులు.. ప్లీనరీలో కేసీఆర్..

TRS Plenary: టీఆర్ఎస్‌లో ఆవిర్భావ జోష్ కన్పిస్తోంది. ప్లీనరీ వేదికగా కేటీఆర్, కవితలకు కీలక పదవులను సీఎం కేసీఆర్ ఎనౌన్స్ చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జాతీయ రాజకీయాలపై ఎమ్మెల్సీ కవిత ఫోకస్ చేస్తున్నారు. ఇటీవల సీఎం ఢిల్లీ టూర్‌లోనూ కవిత కీలకంగా ఉన్నారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణం సైతం కవిత కనుసన్నల్లోనే జరుగుతోందని పార్టీ వర్గాలు అంటున్నాయ్. త్వరలోనే జాతీయ రాజకీయాల్లో కవిత ముఖ్యభూమిక పోషిస్తారని ప్లీనరి వేదికగా కవితకు నేషనల్ కోర్డినేటర్ పదవి ఇస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించాలన్న ఆలోచనలో ఉన్న కేసీఆర్ అందకు తగిన విధంగా పార్టీ నిర్మాణం చేస్తారంటున్నారు నేతలు. ప్లీనరీ వేదికగా కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారన్న అంచనాలో పార్టీ నేతలున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇదే చివరి ప్లీనరి కావడంతో అటు ప్రభుత్వం, ఇటు పార్టీలోనూ కేటీఆర్ కీలక భూమిక పోషించేలా పదవిని ఎనౌన్స్ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ పార్టీ నేతలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story