దుద్దెడలో ఐటీ టవర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్‌

దుద్దెడలో ఐటీ టవర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్‌
x
Highlights

సిద్దిపేట జిల్లా దుద్దెడలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ టవర్‌కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. పారిశ్రామికవేత్తలకు శుభాభినందనలు తెలిపిన సీఎం...

సిద్దిపేట జిల్లా దుద్దెడలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ టవర్‌కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. పారిశ్రామికవేత్తలకు శుభాభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్‌.. ఐటీ రంగంలో సిద్దిపేట పురోగతి సాధిస్తుందన్నారు. భవిష్యత్‌లో జిల్లా పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయం రానుందన్నారు సీఎం కేసీఆర్‌. సీఎం కేసీఆర్‌ సమక్షంలో పలు కంపెనీలతో ఒప్పందాలపై ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సంతకాలు చేశారు. ఇందులో జోలాన్ టెక్నాలజీ , విసాన్ టెక్, ఎంబ్రోడ్స్ టెక్నాలజీ, సెట్విన్ వంటి కంపెనీలు ఉన్నాయి. దుద్దెడలో ఐటీ పార్కును మూడెకరాల విస్తీర్ణంలో రూ. 45 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇందులో 2 వేల మందికి ఉపాధి కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories