KCR Launch National Party: ఇక టీఆర్ఎస్.. భార‌త్ రాష్ట్ర స‌మ‌తి.. అధికారికంగా ప్రకటించిన కేసీఆర్

KCR Launch National Party: తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యయానికి నాంది పలికారు కేసీఆర్.

Arun Chilukuri
Updated on: 5 Oct 2022 1:41 PM IST
KCR Launch National Party Bharat Rashtra Samithi
X

KCR Launch National Party: ఇక టీఆర్ఎస్.. భార‌త్ రాష్ట్ర స‌మ‌తి.. అధికారికంగా ప్రకటించిన కేసీఆర్

KCR Launch National Party: తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యయానికి నాంది పలికారు కేసీఆర్. జాతీయ రాజకీయ పార్టీగా TRSను అధికారికంగా ప్రకటించారు కేసీఆర్. TRSను భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ తీర్మానం చేశారు కేసీఆర్. తెలంగాణ భవన్‌లో నిర్వహిస్తున్న టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో పార్టీ పేరు మార్పు తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఇందుకు సంబధించిన పత్రాలపై కేసీఆర్ సంతకం చేశారు.

తెలంగాణ భ‌వ‌న్ వ‌ద్ద గులాబీ శ్రేణుల సంబురాలు ఆకాశ‌న్నాంటాయి. పార్టీ కార్యక‌ర్తలు భారీ స్థాయిలో త‌ర‌లివ‌చ్చి సంబురాలు చేసుకుంటున్నారు. దేశ్ కా నేత‌.. టుడే సీఎం.. టుమారో పీఎం.. జై కేసీఆర్ స‌ర్.. జై డీఎన్ఆర్ అని ప్రద‌ర్శించిన ప్లకార్డు వైర‌ల్ అవుతోంది. ఇక తెలంగాణ భ‌వ‌న్ వ‌ద్ద పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. గిరిజ‌నుల నృత్యాలు ఆక‌ట్టుకుంటున్నాయి.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story