Uttam Kumar Reddy: కేసీఆర్ పదేపదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు

Uttam Kumar Reddy: కేసీఆర్ హయాంలోనే కదా కాళేశ్వరం నాశనమైంది

Shashank Gullapelli
Published on: 25 April 2024 9:09 AM IST
KCR Is Spreading Lies Again And Again Says Uttam Kumar Reddy
X

Uttam Kumar Reddy: కేసీఆర్ పదేపదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు

Uttam Kumar Reddy: కేసీఆర్ పదేపదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్‌ అన్నారు. నిజాలు చెప్పాల్సిన బాధ్యత మంత్రులుగా తమపై ఉందన్నారు. కేసీఆర్ హయాంలోనే కదా కాళేశ్వరం నాశనమైందని తెలిపారు. కాళేశ్వరంపై రూ.95 వేల కోట్లు ఖర్చు చేశారని... పూర్తి చేయాలంటే రూ.1.5 లక్షల కోట్లు అవుతుందని చెప్పారు. మేడిగడ్డ కుంగింది 2023 అక్టోబర్ 21న.. తాము అధికారంలోకి వచ్చింది డిసెంబర్ 7న అని తెలిపారు. కుంగిన 45 రోజులకు కూడా కేసీఆర్ నోరు మెదపలేదని అన్నారు. ప్రాజెక్టు కుంగిన తర్వాత నీళ్లు వదిలింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే..కానీ మాపై నెపం నెడుతున్నారన్నారు ఉత్తమ్.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story