CM KCR: వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా గులాబీ దళపతి వ్యూహరచన..

CM KCR: బీజేపీ,కాంగ్రెస్‌లకు వ్యూహాత్మక దూరాన్ని పాటిస్తున్న సీఎం కేసీఆర్

Shekhar G
Updated on: 18 July 2023 1:03 PM IST
KCR Is Planning To Focus On National Politics After Scoring A Hat Trick In Telangana
X

CM KCR: తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాకే దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలన్న యోచనలో కేసీఆర్ 

CM KCR: వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా గులాబీ దళపతి వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యూహాత్మక దూరాన్ని పాటిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు సమానదూరం పాటించేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే యూపీఏ, ఎన్‌డీఏ సమావేశాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాకే దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ వ్యూహాన్ని మార్చినట్లు తెలుస్తోంది. యూపీఏ సమావేశానికి హాజరైతే... కాంగ్రెస్‌తో దోస్తి అనే ప్రచారం రాష్ట్రంలో పార్టీకి నష్టం చేస్తుందన్న భావనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎవరితో కలిసి వెళ్లినా బీఆర్ఎస్‌కు రాజకీయంగా లాభించదని కేసీఆర్ భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్రల్లో పోటీ చేయాలన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. రెండు జాతీయ పార్టీతో పోరాడుతున్నామని సంకేతం ఇచ్చేందుకు...రెండు సమావేశాలకు దూరంగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

Shekhar G

Shekhar G

Next Story