CM KCR: నరేంద్ర మోడీకి మనందరం మీటర్ పెట్టాలి.. దేశంలో వేల కోట్ల అవినీతి జరుగుతోంది..

CM KCR: కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు.

Arun Chilukuri
Published on: 29 Aug 2022 5:11 PM IST
KCR Inaugurates Integrated Collectorate Complex in Peddapalli
X

CM KCR: నరేంద్ర మోడీకి మనందరం మీటర్ పెట్టాలి.. దేశంలో వేల కోట్ల అవినీతి జరుగుతోంది..

CM KCR: కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. పెద్ద‌ప‌ల్లి జిల్లాలో స‌మీకృత క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాన్ని ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం ప్ర‌సంగించారు. బీజేపీ ముక్త్ భారత్‌కు కదిలి రావాలన్నారు. దేశంలో వేల కోట్ల అవినీతి జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణలో అమలవుతున్న ఏ ఒక్క పథకం దేశంలో లేదన్నారు. గుజరాత్ మోడల్ అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. మతం పేరుతో గొడవలు సృష్టిస్తున్నారన్నారు. నరేంద్ర మోడీకి మనందరం మీటర్ పెట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బీజేపీ బారి నుంచి దేశాన్ని కాపాడాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా ధరలు పెంచుతోందని కేసీఆర్ మండిపడ్డారు. దేశ రాజకీయాల్లోకి రావాలని రైతు నాయకులు కోరారని అన్నారు కేసీఆర్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story