ప్ర‌ధాని కాదు సేల్స్‌మెన్‌.. మోడీపై సీఎం కేసీఆర్‌ ఫైర్‌..

KCR: ఒక మంచి వ్యక్తిని దేశ రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.

Arun Chilukuri
Published on: 2 July 2022 5:04 PM IST
KCR Hits Out at PM Modi, Calls Him Salesman
X

ప్ర‌ధాని కాదు సేల్స్‌మెన్‌.. మోడీపై సీఎం కేసీఆర్‌ ఫైర్‌.. 

KCR: ఒక మంచి వ్యక్తిని దేశ రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపున బరిలోకి దిగిన యశ్వంత్ సిన్హా ఆ పదవికి అన్ని విధాలా అర్హులని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ పాలనలో ప్రతి రంగం తిరోగమనంలోకి వెళ్లిపోయిందన్నారు. చైనాతో పోల్చితే మనం ఎక్కడున్నామని ప్రశ్నించారు. తాను వ్యక్తిగత విమర్శలు చేయడం లేదని నిజాలే మాట్లాడుతున్నానని చెప్పారు.

శ్రీలంకలో మోడీ ఒక సేల్స్ మెన్ మాదిరి పని చేశారని విమర్శించారు. తాను తినను, ఎవరినీ తిననివ్వను అని చెప్పుకునే మోడీ ఎవరి కోసం సేల్స్ మెన్ గా మారారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను మోడీ ఏనాడైనా నెరవేర్చారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై తాము మౌనంగా ఉండబోమని ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. ప్రసంగాలు ఇవ్వడాన్ని మానేసి తమ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story