ప్రధాని మోడీ తర్వాతి టార్గెట్‌ రైతుల భూములే: సీఎం కేసీఆర్‌ ఫైర్‌..

KCR Fires on PM Modi in Nizamabad
x

ప్రధాని మోడీ తర్వాతి టార్గెట్‌ రైతుల భూములే: సీఎం కేసీఆర్‌ ఫైర్‌..

Highlights

CM KCR: 2024 ఎన్నికల్లో బీజేపీ ముక్త్ భారత్ ప్రభుత్వం రాబోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్.

CM KCR: 2024 ఎన్నికల్లో బీజేపీ ముక్త్ భారత్ ప్రభుత్వం రాబోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. ఇందూరు సభలో పాల్గొన్న కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ రహిత ప్రభుత్వం కేంద్రంలో రాబోతోందని ఆ తర్వాత తెలంగాణ మాదిరిగానే దేశవ్యాప్తంగా రైతులందరికి ఉచిత కరెంట్‌ను అందజేస్తామని స్పష్టం చేశారు కేసీఆర్.

దేశంలో మతపిచ్చితో అల్లకల్లోలం సృష్టించే ప్రతయ్నం జరుగుతోందన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రం సస్యశామల మైన పంటలు కావాలో మతపిచ్చి మంటలు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. దేశం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న కేసీఆర్ ప్రస్తుతం దేశంలో అధికార కాంక్షతో బీజేపీ చేస్తున్న కుట్రలు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలందరూ ఆలోచించి ప్రజలమధ్య మతపిచ్చి లేపుతూ విధ్వంసాలకు పాల్పడుతున్న బీజేపీకి సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

సీఎం కేసీఆర్ కేంద్రంలోని మోడీ ప్రబుత్వంపై మరోసారి ఘాటు విమర్శలుచేశారు. స్వరాష్ట్రంలో సస్యశాలంగా ఉన్న నిజామాబాద్ ఎస్ఆర్ఎస్పీ వరద కాలువపై మోటార్లకు మీటర్లు పెట్టాలని మోడీ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దీని వెనుక పెద్దే కుట్రే ఉందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలు, కరెంటు, అన్నింటినీ అమ్మిన మోడీ కన్ను ఇప్పుడు రైతుల భూములు, వ్యవసాయంపై పడిందన్నారు. ఆయన కార్పొరేట్ శక్తుల కోసం వ్యవసాయ రంగాన్ని నిర్వార్యం చేసి కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పగించే కుట్ర చేస్తోందన్నారు. ఈ విషయాన్ని రైతులందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories