KCR: నేటి నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారం

KCR: మొత్తం 17రోజుల యాత్రలో 21 రోడ్‌ షోలు

Jyothi
Updated on: 24 April 2024 7:51 AM IST
KCR Election Campaign From today
X

KCR: నేటి నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారం 

KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధమయ్యింది. ఇవాళ్టి నుంచి మే 10వ తేదీ వరకు బస్సు యాత్ర కొనసాగనుంది. 17 రోజుల పాటు 12 లోక్‌సభ స్థానాల్లో రోడ్ షోలలో కేసీఆర్ పాల్గొంటారు. కేసీఆర్ యాత్ర కొనసాగించనున్న బస్సుకు తెలంగాణభవన్‌లో గులాబీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు ఉండే విధంగా బస్సు యాత్రకు ప్లాన్ చేశారు. రేపు ఉదయం తెలంగాణ భవన్ నుంచి బయల్దేరి మిర్యాలగూడ చేరుకొని... అక్కడి నుంచి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. మే 10వ తేదీన సిద్ధిపేటలో బస్సు యాత్ర ముగియనుంది. బస్సు యాత్రలో రైతుల అంశం ప్రధాన అజెండాగా ఉండబోతుంది. ఎండిన పంట పొలాలను పరిశీలించడంతో పాటు.. సాగు నీరు, రైతులకు రైతుబంధు, పంటలకు బోనస్ విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేసీఆర్ అడిగి తెలుసుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు... ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన అస్త్రంగా చేసుకోబోతున్నారు.

Jyothi

Jyothi

Next Story