సీట్లు పెంచండి.. కేంద్రానికి సీఎం కేసీఆర్ అల్టిమేటమ్..

Assembly Seats: కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం 370 ఆర్టికల్ రద్దు చేసి క‌శ్మీర్‌ను రెండు రాష్ట్రాలుగా చేసిన సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Updated on: 13 May 2022 6:00 PM IST
KCR Demands Centre to Increase Seats
X

సీట్లు పెంచండి.. కేంద్రానికి సీఎం కేసీఆర్ అల్టిమేటమ్..

Assembly Seats: కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం 370 ఆర్టికల్ రద్దు చేసి క‌శ్మీర్‌ను రెండు రాష్ట్రాలుగా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అక్కడ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ కూడా పూర్తి చేసింది. ఇక పార్ల‌మెంటు ఆమోద‌ముద్ర వేసి ఎన్నిక‌లు జ‌రిపించాల్సి ఉంది. దీంతో తెలంగాణ‌లో కూడా నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య పెంచాలంటూ కేసీఆర్ గ‌ట్టి ప‌ట్టు ప‌ట్ట‌బోతున్నారనే చర్చ జరుగుతోంది. గ‌తంలో చంద్ర‌బాబునాయుడు కూడా ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలంటూ అధికారంలో ఉన్న ఎన్డీయే ప్ర‌భుత్వాన్ని కోరారు కానీ అది వర్కౌట్ కాలేదు. తాజాగా ఇప్పుడు కేసీఆర్ ప్ర‌య‌త్నాలు మళ్లీ మొద‌లుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు, బీజేపీకి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నేపథ్యంలో... కేంద్రం ఏవిధంగా వ్యవహరిస్తోందన్నది చూడాల్సి ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story