KCR: తెలంగాణ కోసం ఒక్కరైనా రాజీనామా చేశారా?

KCR: ఈ కాంగ్రెస్‌ నాయకులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించిన కేసీఆర్

Shekhar G
Published on: 31 Oct 2023 3:47 PM IST
KCR Comments On Congress Party
X

KCR: తెలంగాణ కోసం ఒక్కరైనా రాజీనామా చేశారా?

KCR: దళపతి కేసీఆర్ ప్రచారంలో దూకుడు పెంచారు. హస్తం పార్టీని టార్గెట్‌ చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు కేసీఆర్. కాంగ్రెస్‌ టార్గె‌ట్‌గా విమర్శనాస్త్రాలు సంధిస్తూ... ఎన్నికల వేడిని పెంచుతున్నారు. హుజూర్‌నగర్‌ సభలో చరిత్రను ప్రజలకు వివరించే ప్రయత్నం చేసిన కేసీఆర్... కళ్లముందు జరిగిన చరిత్రను కొందరు వక్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జున సాగర్‌ను.. ఇప్పుడున్న చోట నిర్మించారని కేసీఆర్ కన్నెర్ర చేశారు. తెలంగాణను ఆంధ్రలో కలిపింది కాంగ్రెస్‌ నేతలే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ను నమ్మితే ఆగమైతామని ప్రజలకు సూచించిన కేసీఆర్... పదవుల కోసం ఆనాడు ఆంధ్ర పాలకుల వద్ద ఈ కాంగ్రెస్ నేతలే మోకరిల్లారని గుర్తు చేశారు. అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌ తెలంగాణకు ఒక్కరూపాయి ఇవ్వనంటే..ఈ కాంగ్రెస్‌ నాయకులు ఎందుకు మాట్లాడలేదని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో కోసం తాము కోట్లాడమని పదవులు సైతం త్యాగం చేశామన్నారు. తెలంగాణ కోసం ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా రాజీనామా చేశారా అంటూ దుయ్యబట్టారు.

Shekhar G

Shekhar G

Next Story