KCR: అటు కాంగ్రెస్‌..ఇటు బీజేపీపై ఏక కాలంలో మాటల తూటాలు

KCR: బీజేపీకి బీ టీమ్ అన్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నమా..?

Shekhar G
Published on: 1 Nov 2023 5:03 PM IST
KCR Comments On Congress And Bjp
X

KCR: అటు కాంగ్రెస్‌..ఇటు బీజేపీపై ఏక కాలంలో మాటల తూటాలు

KCR: ఎన్నికల ప్రచార సభల్లో గులాబీ దళపతి గేర్ మార్చారు. ఇన్నాళ్లూ ఒక్క కాంగ్రెస్‌పైనే విమర్శలు చేసిన కేసీఆర్... తొలిసారి బీజేపీని టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేలుస్తున్నారు. సత్తుపల్లి, ఇల్లందు సభల్లో బీజేపీపై దండయాత్ర చేశారు. 15 రోజుల ప్రచారంలో కమలం పార్టీని పల్లెత్తు మాట అనని గులాబీ బాస్.. ఉన్న పళంగా బీజేపీని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి..? కాంగ్రెస్ ఓట్ బ్యాంక్‌ను చీల్చేందుకే బీజేపీని తెరపైకి తీసుకొస్తున్నారా...? బీజేపీకి బీటీమ్ అన్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా అన్నది పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయంగా మారింది.

Shekhar G

Shekhar G

Next Story