KCR: కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా అబద్దాలు మాట్లాడుతున్నారు

KCR: కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే మొదటికే మోసం వస్తుంది

Shekhar G
Published on: 29 Oct 2023 4:59 PM IST
KCR Comments On Congress
X

KCR: కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా అబద్దాలు మాట్లాడుతున్నారు

KCR: తెలంగాణకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని, కాంగ్రెస్ నేతలు సిగ్గు లేకుండా అబద్దాలు మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ తీవ్ర పదజాలంతో ఆరోపించారు. కోదాడలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. భట్టి విక్రమార్క నోరు తెరిస్తే అన్నీ అబద్దాలేనని, పదేళ్లుగా రాష్ట్రంలో కరువు లేదు.. కర్ఫ్యూ లేదని చెప్పారాయన... కాంగ్రెస్ వైఖరిపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. కాంగ్రెస్ నేతలు 3 గంటలే కరెంట్ చాలని మాట్లాడుతున్నారని, కరెంట్ 3 గంటలు కావాలా...? 24 గంటలు కావాలా అని కేసీఆర్ సభకు వచ్చిన ప్రజలను ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే మొదటికే మోసం వస్తుందని హెచ్చారించారాయన.

Shekhar G

Shekhar G

Next Story