CM KCR: రైతు వ్యతిరేకులతో 'జై కిసాన్‌' నినాదం పలికించాలి..

CM KCR: తెలంగాణ వ్యతిరేకులతో నాడు 'జై తెలంగాణ' నినాదాన్ని అనిపించినట్టే.. నేడు రైతు వ్యతిరేకులతో 'జై కిసాన్ నినాదాన్ని పలికించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

Arun Chilukuri
Updated on: 28 Aug 2022 9:00 PM IST
KCR Calls To Raise The Slogan Of Jai Kisan With The Farmers
X

CM KCR: రైతు వ్యతిరేకులతో ‘జై కిసాన్‌’ నినాదం పలికించాలి..

CM KCR: తెలంగాణ వ్యతిరేకులతో నాడు 'జై తెలంగాణ' నినాదాన్ని అనిపించినట్టే.. నేడు రైతు వ్యతిరేకులతో 'జై కిసాన్ నినాదాన్ని పలికించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రగతి భవన్ లో ఆయా రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో రెండోరోజు సీఎం కేసీఆర్ సుధీర్ఘంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలో రైతుల సమస్యలు, అమలు చేయాల్సిన సంక్షేమ పథకాల అమలుతో పాటు, ఢిల్లీ, హైదరాబాద్ సహా, ఉత్తర, దక్షిణ భారత దేశాలను అనుసంధానించేందుకు రైతు కార్యాలయాల నిర్మాణం వంటి ప్రధాన అంశాలపై చర్చించారు.

దేశంలో రైతు నేతలంతా సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కేసీఆర్ సూచించారు. ఇందుకోసం జాతీయ స్థాయిలో రైతు ఐక్యవేధిక ఏర్పాటు చేయాలని తీర్మానించారు. త్వరలో మరోసారి సమావేశం ఏర్పాటు చేసి విధివిధానాలు రూపొందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా రైతులకు ఎక్కడ ఇబ్బందులున్నా పోరాటాలకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story