KCR Birthday: కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న జగిత్యాల అభిమానులు!

KCR Birthday: కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న జగిత్యాల అభిమానులు!
x
Highlights

KCR Birthday: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు.

KCR Birthday: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని ఆకాంక్షిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సురభి శేఖర్ రావు తన మిత్రులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించారు.

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ సహకారంతో తిరుమలలో శ్రీవారిని బ్రేక్ దర్శనం ద్వారా దర్శించుకున్నారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఈ సందర్భంగా స్వామివారిని వేడుకున్నారు.

తిరుమల పర్యటన అనంతరం శేఖర్ రావు బృందం శ్రీకాళహస్తి క్షేత్రాన్ని సందర్శించింది. అక్కడ కేసీఆర్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ నాయకత్వం తెలంగాణకు మళ్లీ అవసరమని, ఆయన జన్మదినం సందర్భంగా ఈ మొక్కులు చెల్లించుకున్నట్లు సురభి శేఖర్ రావు తెలిపారు.

తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన కేసీఆర్ పట్ల తమకున్న కృతజ్ఞతను చాటుకునేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు వారు వెల్లడించారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇప్పటికే ఉభయ రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories