గుజరాత్ లో కేసీఆర్ జన్మదిన సంబరాలు

గుజరాత్ లో కేసీఆర్ జన్మదిన సంబరాలు

Arun Chilukuri
Published on: 17 Feb 2022 3:04 PM IST
KCR Birthday Celebrations in Gujarat
X

గుజరాత్ లో కేసీఆర్ జన్మదిన సంబరాలు

KCR Birthday: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సంబరాలు గుజరాత్ లో కూడా దర్శనమిస్తున్నాయి. సూరత్ లోని ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జికి అడ్డంగా కేసీఆర్ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. జనహృదయ నేత, తెలంగాణ జాతిపిత, భావి తెలంగాణ నిర్మాత అంటూ కేసీఆర్ దీర్ఘాలోచనలో ఉన్న పెద్ద ఫొటోతో పాటు తెలంగాణ కోసం నినదిస్తున్న కేటీఆర్ ఫొటో కూడా హైలైట్ చేస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

అలాగే గుజరాతీ భాషలో కూడా కేసీఆర్ క్యారెక్టర్ హైలైట్ చేస్తూ ఓ క్యాప్షన్ ఇచ్చారు. మరో ముఖ్య విషయం ఏంటంటే కేసీఆర్ ను తెలంగాణ సాయి అంటూ ఇంగ్లిష్ లో మరో ప్రధాన క్యాప్షన్ యాడ్ చేశారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటానని కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. ఆ తరువాత వచ్చిన తన బర్త్ డే సెలబ్రేషన్స్ ని థర్డ్ ఫ్రంట్ కోసం టీఆర్ఎస్ శ్రేణులు ఇలా ఉపయోగించుకుంటున్నాయంటున్నారు విశ్లేషకులు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story