KCR: కాళేశ్వరం కమిషన్‌ ఎదుట విచారణకు హాజరైన కేసీఆర్‌

KCR: తెలంగాణలో అత్యంత ప్రాధాన్యమైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 11 Jun 2025 11:27 AM IST
KCR Attends Kaleshwaram Enquiry
X

KCR: కాళేశ్వరం కమిషన్‌ ఎదుట విచారణకు హాజరైన కేసీఆర్‌

KCR: తెలంగాణలో అత్యంత ప్రాధాన్యమైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారతీయ రాష్ట్ర సమితి (భారాస) అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఈ రోజు కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) ఎదుట హాజరయ్యారు.

బీఆర్కే భవన్‌లో ఏర్పాటు చేసిన విచారణలో జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ కేసీఆర్‌ను ప్రశ్నిస్తోంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటి నిల్వల వివరాలు తదితర అంశాలపై వివరణ కోరినట్లు సమాచారం.

కేసీఆర్‌తో పాటు, విచారణకు రావడానికి 9 మంది నేతలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇప్పటివరకు ఈ కమిషన్ 114 మందిని విచారించిందని అధికార వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉండగా, ఈ నెల 6న ఈటల రాజేందర్, 9న హరీశ్ రావు ఈ same కమిషన్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. తాజా పరిణామంతో కాళేశ్వరం విచారణ మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story