CM KCR: కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరో రూ.500 కోట్లు..

KCR Announces More 500 Crores for Kondagattu Anjanna Temple
x

CM KCR: కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరో రూ.500 కోట్లు..

Highlights

CM KCR: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్ర అభివృద్ధికి అదనంగా మరో రూ.500కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

CM KCR: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్ర అభివృద్ధికి అదనంగా మరో రూ.500కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కొండగట్టు పర్యటనలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రూ.100కోట్లు ప్రకటించామని.. మరో రూ.500కోట్లు (మొత్తం రూ.600కోట్లు) కూడా కేటాయించనున్నట్లు వెల్లడించారు. దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే.. కొండగట్టు అనే పేరు వినపడాలన్నారు. ప్రపంచాన్నే ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా.. కొండగట్టును తీర్చిదిద్దాలని సూచించారు. సుమారు 850 ఎకరాలలో ఆలయ అభివృద్ధి, 86 ఎకరాలలో సువిశాల పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు సీఎం కేసీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories