Breaking News: తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీ - కేసీఆర్ కీలక ప్రకటన

KCR Announced 80039 Govt Jobs Notification 2022 in Telangana | KCR Breaking News
x

Breaking News: తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీ - కేసీఆర్ కీలక ప్రకటన 

Highlights

Breaking News: *లక్షా 56 వేల ఉద్యోగాలు నోటిఫై చేశాం *95 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇస్తున్నాం

Breaking News: తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. నిరుద్యోగులకు సీఎం కేసీఆర్‌ తీపికబురు అందించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో సీఎం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన 11,103 ఒప్పంద ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ 95 శాతం స్థానికత కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామని చెప్పారు. అటెండర్‌ నుంచి ఆర్డీవో వరకు 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వస్తాయన్నారు. ఐదు శాతం మాత్రమే స్థానికేతరులకు వస్తాయని వివరించారు. నియామకాల్లో 95 శాతం స్థానిక కోటా సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని సీఎం చెప్పారు.

ఖాళీల వివరాలివీ...

సీఎం కేసీఆర్‌ ప్రకటన ప్రకారం శాఖల వారీగా ఖాళీవ వివరాలను పరిశీలిస్తే.. హోంశాఖలో 18,344 పోస్టులు, పాఠశాల విద్యాశాఖలో 13,086, వైద్యారోగ్యశాఖలో 12,755, ఉన్నత విద్యాశాఖలో 7,878, బీసీ సంక్షేమశాఖలో 4,311 పోస్టులను భర్తీ చేయనున్నారు.

షెడ్యూల్ 9, 10 పరిష్కారం అయితే ఉద్యోగాలు మరిన్ని వస్తాయి

91,142 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి

91,142 ఉద్యోగాలు నోటిఫై చేస్తున్నాం

11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చేస్తున్నాం

80,039 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తున్నాం

ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు - సీఎం కేసీఆర్

జనరల్ అభ్యర్థుల వయో పరిమితి 44 ఏళ్లకు పెంపు

ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 49 ఏళ్లకు పెంపు

దివ్యాంగులకు 54 ఏళ్లకు పెంపు

నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్

మొత్తం 80,039 పోస్టుల భర్తీకి నిర్ణయం

గ్రూప్‌-1: 503, గ్రూప్‌-2: 582 పోస్టుల

గ్రూప్‌-3: 1,373, గ్రూప్‌-4: 9,168 పోస్టులు

జిల్లా స్థాయిలో 39,829 పోస్టులు

జోనల్ స్థాయిలో 18,866 పోస్టులు

మల్టీ జోన్‌లో 13,170 పోస్టులు

అదర్ కేటగిరి, వర్సిటీలల్లో 8,174 పోస్టులు

తెలంగాణలో 33 జిల్లాల వారీగా ఖాళీలు...

హైదరాబాద్- 5,268, నిజామాబాద్- 1,976

మేడ్చల్-మల్కాజ్‌గిరి 1,769, రంగారెడ్డి 1,561

కరీంనగర్- 1,465, నల్గొండ-1,398, కామారెడ్డి- 1,340

ఖమ్మం- 1,340 భద్రాద్రి కొత్తగూడెం- 1,316

నాగర్‌కర్నూల్- 1,257, సంగారెడ్డి- 1,243

మహబూబ్‌నగర్- 1,213, ఆదిలాబాద్- 1,193

సిద్దిపేట- 1,178, మహబూబాబాద్- 1,172

హన్మకొండ- 1,157, మెదక్- 1,149, జగిత్యాల- 1,063

మంచిర్యాల- 1,025, యాదాద్రి భువనగిరి- 1,010

భూపాలపల్లి- 918, నిర్మల్- 876, వరంగల్- 842

కొమ్రంభీం ఆసిఫాబాద్- 825, పెద్దపల్లి- 800

జనగాం- 760, నారాయణపేట్- 741, వికారాబాద్- 738

సూర్యాపేట్- 719, ములుగు- 696, జోగులాంబ గద్వాల్- 662

రాజన్న సిరిసిల్ల- 601, వనపర్తి- 556

Show Full Article
Print Article
Next Story
More Stories