తెలంగాణలో హాట్‌సీట్‌ నియోజకవర్గంగా కామారెడ్డి.. పోటీ చేస్తున్న కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి

Kamareddy: అందరి చూపు కామారెడ్డి నియోజకవర్గం వైపే

Jyothi
Published on: 7 Nov 2023 12:35 PM IST
KCR and Revanth Reddy are Contesting in Kamareddy
X

తెలంగాణలో హాట్‌సీట్‌ నియోజకవర్గంగా కామారెడ్డి.. పోటీ చేస్తున్న కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి

Kamareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం అందరిచూపు కామారెడ్డి నియోజకవర్గంపైనే ఉంది. కామారెడ్డి సీట్‌ హాట్‌ హాట్‌గా మారగా.. అక్కడ ఎవరు గెలుస్తారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం సీఎం కేసీఆర్‌ కామారెడ్డిలో పోటీ చేస్తుండటమే. కాగా సీఎం కేసీఆర్ పై పోటీకి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సై అన్నారు. 9న కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేసి అదే రోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు. మరోవైపు రేవం‌త్‌రెడ్డి 10వ తేదిన నామినేషన్‌ వేసి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సభకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరుకానున్నారు.

Jyothi

Jyothi

Next Story