MLC Kavitha: ధర్మ పరిరక్షణే సీఎం కేసీఆర్ ధ్యేయం..
MLC Kavitha: ధర్మ పరిరక్షణే సీఎం కేసీఆర్ ధ్యేయం అన్నారు ఎమ్మెల్సీ కవిత.
MLC Kavitha: ధర్మ పరిరక్షణే సీఎం కేసీఆర్ ధ్యేయం..
MLC Kavitha: ధర్మ పరిరక్షణే సీఎం కేసీఆర్ ధ్యేయం అన్నారు ఎమ్మెల్సీ కవిత. ప్రభుత్వ చర్యలతో తెలంగాణలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందన్నారు. వేల కోట్లతో దేవాలయాలను అభివృద్ధి చేశారని కొనియాడారు. నిజాబాద్ జిల్లా నందిపేట్ మండలం పలుగుట్ట కేదారేశ్వరాశ్రమంలో సాధూ పరిషత్ 57వ మహాసభల్లో కవిత పాల్గొన్నారు. ఆర్మూర్ గొప్ప దైవచింతన కలిగిన నేలన్నారు. పరమశివుడి దివ్యక్షేత్రం సిద్ధులగుట్ట భక్తుల కొంగుబంగారంగా నిలుస్తుందన్నారు. పలుగుట్ట కేదారేశ్వరాశ్రమం అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సైతం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Next Story




