Kalvakuntla Kavitha: కారులోంచి దిగిపోయిన కవిత.. భవిష్యతులో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతారా?

Kavitha Suspended from BRS Will She Launch a New Party or Join Another
x

Kalvakuntla Kavitha: కారులోంచి దిగిపోయిన కవిత.. భవిష్యతులో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతారా?

Highlights

Kalvakuntla Kavitha: కవితను కారు నుంచి దింపేశారు. గులాబీ జెండాతో ఏళ్ల నుంచి ఉన్న బంధం పూర్తిగా తెగిపోయింది.

Kalvakuntla Kavitha: కవితను కారు నుంచి దింపేశారు. గులాబీ జెండాతో ఏళ్ల నుంచి ఉన్న బంధం పూర్తిగా తెగిపోయింది. మరి కవిత రాజకీయ ప్రయాణం ఎటు..? కొత్త పార్టీ పెడతారా లేక ఇతర పార్టీలో చేరుతారా..? ఒకవేళ వేరు కుంపటి పెడితే.. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎగితే సత్తా ఉందా..? భవిష్యత్తులో బాపుతోనే కవిత సమరం కొనసాగించనున్నారా..? ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ మానగలుగుతుందా..?

ఉన్నట్టుండి కారులో అలజడి. అంతే సారుకు చిర్రెత్తింది.. ఇక ఇంతకి మించిన డ్యామేజ్ వద్దనుకున్నారో... ఇలా అయితే తప్ప మళ్లీ గాడిలోకి రాదనుకున్నారో.. గీత దాటిన మాటకు వేటు తప్పలేదు. అధినాయకత్వాన్ని ధిక్కరిస్తే కన్నకూతురైనా ఉపేక్షించేది లేదని గులాబీ బాస్‌ బల్లగుద్ది చెప్పారు. సస్పెండ్ అస్త్రాన్ని ప్రయోగించారు. నిన్నటి వరకు డాటర్‌ షాక్‌లు ఇస్తే.. నేడు డాడి యాక్షన్ తీసున్నారు. పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్నాక.. నువ్వు ఉండాల్సిన అవసరం ఏంటంటూ.. గెటౌట్ అన్నారు.

నిన్నటి వరకు కవిత వెనకాల కేసీఆర్ ఉన్నారు. కాబట్టి అప్పుడామే ఏం చేసినా నడిచింది. పార్టీని డ్యామేజ్ చేసేలా ఏం మాట్లాడినా ఎవరూ నోరు మెదపలేదు. అంతా సర్ధుకుంటుందిలే అనుకున్నారు. కానీ ఫైనల్‌గా తుఫాన్ తీరం దాటింది. కవిత ఇప్పుడు డాడీ సపోర్ట్ లేని జస్ట్ పొలిటికల్ లీడర్ మాత్రమే. ఐతే ఇప్పుడు కవితను.. ఎన్నో ప్రశ్నలు,,మరొన్నో సవాల్లు వెంటాడుతున్నాయి. భవిష‌్యత్తులో కవిత రాజకీయ ప్రయాణం ఎటు వైపు.. ? కొత్తగా రాజకీయ పార్టీ పెడతారా లేక ఇతర పార్టీలో చేరుతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆమె నడుపుతున్న జాగృత్తి సంస్థనే రాజకీయ పార్టీగా ప్రకటిస్తారా.. అదే జరిగితే పార్టీని నడిపేంత సత్తా కవితకు ఉందా..? వేరు కుంపటి పెడితే కవిత ఏ మేరకు సక్సెస్ అవుతారు..? షర్మిల లాగే కవిత కూడా విఫల ప్రయోగంగా మిగులుతారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయంగా కవిత పార్టీని నడిపించగలరా..? గులాబీ పార్టీ సానుభూతి పరులను తన వైపు తిప్పుకుంటారా..? అసలు కవితను నమ్మి ఆమె వెంట నడిచే నాయకులు ఎంత మంది..? ఇలా ఎన్నో సందేహాలు..

లిక్కర్ కేసులో జైలుకు వెళ్లొచ్చాకే కవిత తీరులో పెను మార్పులు కనిపించాయి. జైలుకు ముందు ఆ తర్వాత అన్నట్టుగా ఆమె పొలిటికల్ నిర్ణయాలు ఉన్నాయి. వరంగల్ సభ నిర్వహణ తీరు, కేసీఆర్ వైఖరిని ప్రస్తావిస్తూ కేసీఆర్‌కు కవిత లేఖ రాయడం, అది కాస్త లీక్ కావడంతో.. తొలిసారిగా పార్టీతో కవితకు ఉన్న విభేదాలు బయటపడ్డాయి. బీజేపీతో పొత్తుకు ప్రయత్నాలు జరిగాయని, కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పి.. పార్టీకి దూరం జరిగారు కవిత. ఇలా రాను రాను పార్టీకి నష్టం చేసేలా ఉన్న కవిత తీరుతో.. విసిగిపోయిన కేసీఆర్‌ చివరికి ఇలా వేటు వేశారు. ఐతే ఆమెపై సస్పెన్స్‌ వేటుకు ముందే.. కవితను మెల్ల మెల్లగా జీరోను చేసే ప్రయత్నాలు చేశారు. ముందుగా కవిత జాగృతి కార్యక్రమాలకు ఎవరూ వెళ్లకూడదనే ఆదేశాలు వెల్లాయి. కేడర్ మద్దతు లేకుండా కవితను ఒంటరిని చేసే ప్రయత్నం చేశారు. ఐనా వినకపోవడంతో..బీఆర్ఎస్‌కు అనుబంధం సంఘంగా ఉన్న సింగరేణి కార్మిక సంఘానికి ఆమెను గౌవర అధ్యక్షురాలిగా తొలగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో.. హరీష్‌పై కవిత కామెంట్స్‌తో.. కవిత విషయంలో ఇంకా లేట్ చేస్తే పార్టీకి ఇంకాస్త డ్యామేజ్ అవుతుందని భావించి.. వేటు వేశారు కేసీఆర్. ఐతే కవితే వేటు వేస్తే.. ఆటోమెటిక్‌గా ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తుందని గ్రహించే.. ఇలా పావులు కదిపినట్టు తెలుస్తోంది.

కవిత కొత్త పార్టీ పెట్టనుందన్న ప్రచారం నేపథ్యంలో.. అసలు తెలంగాణలో మరో రాజకీయ పార్టీ అవసరం ఉందా..? ఇప్పటికే ఉన్న పార్టీలను కాదని కొత్త పార్టీని ప్రజలు ఆధరిస్తారా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కవిత తనను తాను ఎక్కువగా ఊహించుకుని.. బోల్తా కొడతారా అనే విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో తెలంగాణలో ఇలానే కొత్త పార్టీలు వచ్చి తర్వాత దుకాణం మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. షర్మిల వైఎస్సార్ టీపీ పెట్టారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. బహుజన సమాజ్‌వాద్ పార్టీని బలోపేతం చేయాలని చూశారు. కానీ వాళ్ల ప్రయత్నాలన్నీ విఫలం అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు, బీఆర్ఎస్ బలంగా ఉన్నాయి.

బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాబట్టి.. జనాలు ఆదరించి రెండు టర్మ్‌లు అధికారం కట్టబెట్టారు. కానీ కవితకు ఆ దమ్ము, సత్తా ఉందా ? ప్రత్యక్ష రాజకీయాల్లో కవిత గెలిచిందే ఒకసారి. అది కూడా తెలంగాణ సెంటిమెంట్‌తో నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2018లో ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో అసలు పోటీలోనే లేరు. అలాంటి కవిత పార్టీ పెడితే.. సక్సెస్ అవుతారు అనుకోవడం.. సహసమే అవుతుంది. పైగా కవిత జాతీయ రాజకీయాలపైనే ఇంట్రెస్ట్ చూపించేవారు. రాష్ట్ర రాజకీయాలపై ఆమెకు పెద్దగా పట్టు లేదు. ఇప్పుడు ఒంటరిగా కవిత పార్టీ పెట్టి రాణించాలనుకోవడం.. పెద్ద టాస్కే అవుతుంది. కేసీఆర్, కేటీఆర్,, హరీష్‌ రావుతో పోల్చితే.. జనాలతో కవితకు అనుబంధం చాలా తక్కువ. అలాంటి కల్వకుంట్ల ఫ్యామిలీని కాదని.. ఓటర్లు కవిత వైపు నిలబడతారా..? ఇన్ని బలాబలాల దృష్ట్య.. కవిత కొత్త పార్టీ పెట్టడం కన్నా..మరో పార్టీలో చేరి తన రాజకీయ భవిష్యత్తును వెత్తుకోవడమే మెరుగని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories