Kalvakuntla Kavitha: క్యాబినెట్ గతంలో ఎర్రవెల్లికి.. ఇప్పుడు ఢిల్లీకి..

Kalvakuntla Kavitha: క్యాబినెట్ గతంలో ఎర్రవెల్లికి.. ఇప్పుడు ఢిల్లీకి..
x

Kalvakuntla Kavitha: క్యాబినెట్ గతంలో ఎర్రవెల్లికి.. ఇప్పుడు ఢిల్లీకి..

Highlights

Kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు.

Kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు మరియు ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో పాలన తీరుపై కవిత స్పందిస్తూ.. "గత ప్రభుత్వంలో క్యాబినెట్ ఎర్రవెల్లికి (ఫామ్ హౌస్) వెళ్లేది, ఇప్పుడు ఢిల్లీకి వెళ్తోంది.. రెండింటికీ పెద్ద తేడా ఏమీ లేదు" అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ పక్కన ఉద్యమ ద్రోహులు ఉన్నారని, అటువంటి వారిని పక్కన పెట్టుకుని ఉద్యమకారుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఆమె మండిపడ్డారు.

ఆర్టీసీ సమస్యలపై గళం:

ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడిన కవిత, ప్రభుత్వంపై పలు డిమాండ్లు ఉంచారు. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వివిధ కారణాలతో ఆర్టీసీలో తొలగించిన కార్మికులను ఎటువంటి షరతులు లేకుండా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. "ఆర్టీసీలో ప్రస్తుతం యూనియన్లు లేవు, చైర్మన్ లేరు. యూనియన్లపై నిషేధం ఎత్తివేస్తామని చెప్పి ఏమైంది?" అని ఆమె ప్రశ్నించారు. వెంటనే సంస్థకు చైర్మన్‌ను నియమించాలని సూచించారు. ఆర్టీసీకి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు రావడం లేదని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కవిత పేర్కొన్నారు. తెలంగాణ సమాజం అన్నింటినీ గమనిస్తోందని, త్వరలోనే తమ కార్యాచరణను ప్రకటిస్తామని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories