MLC Kavitha: కవిత జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పెంపు

MLC Kavitha: మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగింపు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 July 2024 9:25 PM IST
Kavitha judicial custody increased once again
X

MLC Kavitha: కవిత జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పెంపు

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో BRS MLC కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. మనీ లాండరింగ్ ఆరోపణలపై ED అరెస్ట్ చేసిన కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్‌ను ట్రయల్ కోర్టు మరోసారి పొడిగించింది. ఆగస్ట్ 13 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవితను ఈ ఏడాది మార్చి 16న ED అరెస్ట్ చేసింది. నేటితో జ్యుడీషియల్ రిమాండ్‌ ముగియనుండగా... అధికారులు వర్చువల్‌గా ఆమెను న్యాయస్థానంలో హాజరు పర్చారు. కేసు విచారణ కీలక దశలో ఉన్నదని.. ఈ సమయంలో కవిత కస్టడీని పొడగించాలని ఈడీ తరుఫు లాయర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కవితకు మరో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story