MLC Kavitha: కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ శుక్రవారానికి వాయిదా

MLC Kavitha: గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి ఆదేశం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 July 2024 7:31 PM IST
Kavitha default bail petition adjourned to Friday
X

MLC Kavitha: కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ శుక్రవారానికి వాయిదా

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆశ్రయించారు. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం... గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. అనంతరం కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారానికి వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు. మరోవైపు సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశాన్ని సైతం శుక్రవారం రోజునే విచారణ చేపడతామని తెలిపింది కోర్టు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story