Kaushik Reddy: నన్ను గెలిపించండి.. వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తా

Kaushik Reddy: నామినేషన్ వేసిన రిటర్నింగ్ ఆఫీసులో పాడి కౌశిక్ రెడ్డి

Jyothi
Published on: 10 Nov 2023 7:41 PM IST
Kaushik Reddy File Nomination In Huzurabad
X

 Kaushik Reddy: నన్ను గెలిపించండి.. వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తా

Kaushik Reddy: హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో నామినేషన్ వేశానని, కేసీఆర్ మూడోసారి సీఎం కాబోతున్నారని అన్నారాయన... తనను హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే వెయ్యి కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కౌశిక్ రెడ్డి కోరారు.

Jyothi

Jyothi

Next Story