Kasireddy Narayan Reddy: మాయమాటలతో మభ్యపెడుతున్న ముఖ్యమంత్రి

Kasireddy Narayan Reddy: కాకమ్మ కథలు చెప్పి ఇచ్చిన హామీలు నెరవేర్చని కేసీఆర్

Shekhar G
Updated on: 23 Nov 2023 8:45 PM IST
Kasireddy Narayan Reddy Comments On KCR
X

Kasireddy Narayan Reddy: మాయమాటలతో మభ్యపెడుతున్న ముఖ్యమంత్రి 

Kasireddy Narayan Reddy: కాకమ్మ కథలు చెప్పి తొమ్మిది సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాయమాటలతో సీఎం కేసీఆర్ మభ్యపెడుతున్నారని కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని మైసిగండి, పెద్ద వేములోనిబావి తండా, చిన్న వేములోనిబావి తండా, గడ్డమీద తండా, వెలుగు రాళ్ల తండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు... టీ పీసీసీ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ కమ్లి ముత్యానాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు... ప్రతి కుటుంబాన్ని కలుస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ... ముందుకు సాగారు... మహిళలతో కలిసి కాసేపు ముచ్చటించి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు కసిరెడ్డి నారాయణ రెడ్డి.

Shekhar G

Shekhar G

Next Story