Kasireddy Narayan Reddy: రాష్ట్రంలో కేసీఆర్.. దేశంలో మోడీ ప్రజలను మోసం చేస్తున్నారు

Kasireddy Narayan Reddy: నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తా

Shekhar G
Updated on: 17 Nov 2023 8:45 PM IST
Kasireddy Narayan Reddy Comments On BRS And BJP
X

Kasireddy Narayan Reddy: రాష్ట్రంలో కేసీఆర్.. దేశంలో మోడీ ప్రజలను మోసం చేస్తున్నారు

Kasireddy Narayan Reddy: సీఎం కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని ఓట్లు వేయించుకుని రైతులను మోసం చేశారని కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమనగల్ మండలంలోని రాంనుతల, శెట్టిపల్లి, కొనాపూర్, గౌరారం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కేసీఆర్ దేశంలో మోడీ ప్రజలను మోసం చేస్తున్నారని కసిరెడ్డి ఆరోపించారు. తనను గెలిపిస్తే నియోజకవర్గ సమస్యలను పరిష్కరించి కల్వకుర్తి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

Shekhar G

Shekhar G

Next Story