Top
logo

ఆ జిల్లా ప్రజలను వేదిస్తున్న మందుల కొరత

ఆ జిల్లా ప్రజలను వేదిస్తున్న మందుల కొరత
X
Highlights

ఆ జిల్లా ప్రజలను మందుల కొరత వేదిస్తోంది. రోగులకు అందాల్సిన అత్యవసర మందులు అందుబాటులో లేకపోవడంతో...

ఆ జిల్లా ప్రజలను మందుల కొరత వేదిస్తోంది. రోగులకు అందాల్సిన అత్యవసర మందులు అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల్లో చలనం లేకపోవడంతో రోగులు ఆపస్థలు పడుతున్నారు. బయటి మెడికల్‌ దుకాణాలలో మందులు కొనలేక పడరాని పాట్లు పడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో మెరుగైన వైద్యం కోసం ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని పెద్దాసుపత్రిలో పేదలకు పూర్తి స్థాయిలో వైద్యం అందడం లేదనే ఆరోపణలు వస్తున్న పట్టించుకునే నాదులు కరువయ్యాడు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు పెద్దాసుపత్రికి వస్తే మందులు సరిగ్గా అందడం లేదని చెబుతున్నారు.

ఆస్పత్రిలో అన్ని విభాగాల రోగులకు మందులు సరిపడా ఉన్నాయని అధికారులు చెబుతున్నా పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆసుపత్రిలో కొంత కాలంగా సిటి స్కాన్ యంత్రం మరమ్మత్తులకు నోచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు కరోనా మరోవైపు వైరల్‌ ఫీవర్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఆస్పత్రి అధికారుల తీరు ఆందోళన కలిగిస్తోందని ప్రజలు చెబుతున్నారు. దిక్కుతోచని స్థితిలో పెద్దాసుపత్రికి వస్తే ప్రైవేట్‌ మెడికల్‌ స్టోర్స్‌కి పంపిస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదునుగా మెడికల్‌ షాపుల్లో కూడా మందుల ధరలు పెంచారని వాపోతున్నారు. మరోవైపు ఆస్పత్రిలో రోగులకు కనీస సౌకర్యాలు కూడా లేవని జిల్లా వాసలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జిల్లా ప్రభుత్వ పెద్దాసుపత్రిలో అటు అధికారుల సమన్వయ లోపమో లేక మందుల కొరతో తెలియదు కానీ ఆస్పత్రికి వచ్చే రోగులు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Web TitleKarimnagar district suffers from a lack of Medicines
Next Story