Congress: కరీంనగర్ కాంగ్రెస్ నేతల విచిత్ర పరిస్థితి.. అధికార కాంగ్రెస్ పరువు తీస్తున్న సొంత పార్టీ నేతలు

Congress: కరీంనగర్ కాంగ్రెస్ నేతల విచిత్ర పరిస్థితి.. అధికార కాంగ్రెస్ పరువు తీస్తున్న సొంత పార్టీ నేతలు
x

Congress: కరీంనగర్ కాంగ్రెస్ నేతల విచిత్ర పరిస్థితి.. అధికార కాంగ్రెస్ పరువు తీస్తున్న సొంత పార్టీ నేతలు

Highlights

Karimnagar Congress: అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరినొకరు విమర్శించుకోవడం కామన్.

Karimnagar Congress: అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరినొకరు విమర్శించుకోవడం కామన్. కానీ తమకు ప్రతిపక్షం ఎందుకు అనుకున్నారో ఏమో.. కరీంనగర్ కాంగ్రెస్ నేతలు సొంత ప్రభుత్వంపైనే దుమ్మెత్తి పోస్తున్నారట. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు పరస్పరం పోటాపోటీగా ప్రెస్‌మీట్లు పెట్టడం, నిరసన కార్యక్రమాలతో మండిపడిపోతున్నారట. ఇంతకీ అసలు లీడర్ల మాటునా.. తమ అనుచరగణం రోడ్డెక్కి హడావుడి చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇంత రాద్ధాంతం జరుగుతోంటే.. జిల్లాకు చెందిన మంత్రులు మాత్రం మాకేందుకులే అని లైట్ తీసుకుంటున్నారట. అసలు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..? ఈ పరిస్థితి ఎందుకొచ్చింది..? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలు భలే గమ్మత్తుగా, విచిత్రంగా తయారయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నేతల చేష్టలు చూసి ప్రతిపక్షాలు సైలెంట్‌గా ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఎంజాయ్ చేస్తున్నాయట. మీరూ మీరూ కొట్టుకుంటే కొట్టుకోండి.. కానీ మమల్ని ఎంటర్‌టైన్ చేయండి అంటూ సైటరికల్‌గా నవ్వుతున్నారట. కరీంనగర్ ఎంపీ అభ్యర్దిగా పోటి చేసిన వెలిచాల రాజేందర్ రావు, డీసీసీఅద్యక్ష్యుడు కవ్వంపల్లి సత్యనారయణకు మధ్య జరుగుతున్న పోరు... ఇఫ్పుడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిందట. వర్గపోరు కాంగ్రెస్ పార్టీలో వెరీ కామాన్‌లే..! అనుకున్న స్దానికులకు షాక్ ఇస్తూ ... ఇప్పుడు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారట. అంతేకాదు పోటాపోటీగా ప్రెస్‌మీర్టు పెట్టి మరీ.. పరస్పరం విమర్శించుకుంటూ కొత్త పోకడ చూపిస్తున్నారట. ఇలా ప్రతిపక్షాలు చేయాల్సిన విమర్శలు కూడా కాంగ్రెస్ వారే చేసుకుంటున్నారట. మా నాయకులను పొగడాలన్నా మేమే.. తిట్టాలన్నా మేమే అనే డైలాగులు సైతం వేసుకుంటున్నారట.

స్దానిక ఎన్నికల నేపథ్యంలో వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్‌లో కాస్త హడావుడి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దగ్గరయ్యే ప్రయత్నాలు ప్రారంభించి.. తన గ్రౌండ్ వర్క్ తాను చేసుకుంటూ వెళ్తున్నారట. ఈ క్రమంలో వెలిచాల రాజేందర్ రావును ఈ మధ్య సీఎం పిలిపించుకుని మాట్లాడటం, స్థానిక ఎన్నికల నేపథ్యంలో బాగా పనిచేయాలని సూచించడంతో కరీంనగర్‌లో ఆయన పేరు కాస్త హాట్ టాపిక్ అయ్యిందట. ఈ పరిణామాలతో ఆయనకు కరీంనగర్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు అప్పజెప్పుతారనే ప్రచారం కూడా మొదలైయ్యింది. ఇవన్నీ వెరసి.. అంతర్గత రాజకీయాల్లో నిప్పు రాజుకుందట. ఇక్కడి వరకు బానే ఉన్నప్పటికీ, వెలిచాల రాజేందర్ రావు చేసే కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని ఫ్లెక్సీల్లో జిల్లా అధ్యక్షుడైన, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఫోటోలు లేకపోవడంతో అసలు గొడవ మొదలైయ్యిందట. మా నాయకుడి ఫోటోనే పెట్టవా..? అంటూ కవ్వంపల్లి వర్గీయులు, వెలిచాలకు వ్యతిరేకంగా కరీంనగర్‌లో ఓ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కట్ చేస్తే.. ఇటు వెలిచాల వర్గం కూడా కవ్వంపల్లికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శల దాడి చేశారు.

ఇలా ఒకరిపై ఒకరు అధికార కాంగ్రెస్ నాయకులే కొట్టుకుంటుంటే.. ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు నవ్వుకుంటున్నారట. మాకూ కాస్త అవకాశం ఇవ్వండోయ్ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారట. ఎవరమనుకున్నాకూడా పట్టువీడని విక్రమార్కుల్లా తయారయ్యారట కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు. మొత్తమ్మీద విపక్షాల విమర్శలు దేవుడెరుగు.. కరీంనగర్ కాంగ్రెస్ పరువును సొంత నాయకులే మానేరు నదిలో కలిపేస్తున్నారట. ఇంతలా సొంత పార్టీ నేతలు కొట్టుకుంటుంటే జిల్లాకు చెందిన మంత్రులు మాత్రం మాకేందుకుచ్చొన గొడవ అనుకుంటున్నారట. తెలిసినా తెలియనట్టుగానే ఉంటూ అవునా.. అలా జరుగుతోందా అని ఆశ్చర్యం, అమాయకత్వం ప్రదర్శిస్తున్నారట. కరీంనగర్ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ జిల్లా కాంగ్రెస్ పరిస్దితి ఇప్పుడు నడిసంద్రంలో చిల్లి పడ్డ నావలా తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకే మాటపై నిలబడతారో..? అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీ తమదే కదా.. అంటూ ఇలాగే రోడ్డెక్కి.. ప్రతిపక్షాలకు అస్త్రం అవుతారో చూడాలి మరి.


Show Full Article
Print Article
Next Story
More Stories