కామారెడ్డి జిల్లాలో తమ నాయకులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలు

కామారెడ్డి జిల్లాలో తమ నాయకులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలు
x

కామారెడ్డి జిల్లాలో తమ నాయకులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలు

Highlights

కామారెడ్డి జిల్లాలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు స్థానాల కోసం తమ నాయకులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కామారెడ్డి జిల్లాలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు స్థానాల కోసం తమ నాయకులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పంచాయతీ ఎన్నికలు లేకుండా ఏకగ్రీవ పాలనకు గ్రామస్తులు జై కొట్టారు. ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా ఒకే ఒక నామినేషన్ దాఖలు చేశారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు ఒకవైపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సర్పంచ్ స్థానం కోసం పదుల సంఖ్యలో నామినేషన్ దాఖలు కాగా.. విత్ డ్రా కోసం అవకాశం ఉన్న చివరి రోజు అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామనే హామీలతో పలు గ్రామాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కామారెడ్డి జిల్లాలో మొత్తం 532 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొదటి విడతలో 167 పంచాయతీలకు గాను 156 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 167 స్థానాల్లో 11 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వెయ్యి 520 వార్డు స్థానాలలో 433 ఏకగ్రీవం కాగా....వెయ్యి 84 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందుకుగాను 3వేల 240 మంది పోటిలో ఉన్నారు.

నామినేషన్ల విత్‌డ్రా ముగిసిన తర్వాత బరిలో ఉన్న అభ్యర్థులు ఏవరనేది స్పష్టం అయ్యింది. మద్దతు కూడగట్టుకొవటం, నామినేషన్ల దాఖలు, విత్‌డ్రాలపై ఫోకస్ చేసిన అభ్యర్థులు ఇప్పుడు ప్రచారంపై దృష్టి పెట్టారు. కామారెడ్డి జిల్లా పరిధిలో ఈనెల 11న పోలింగ్ జరుగనుంది. మొత్తం స్థానాలకి గాను 11 పంచాయతీలు ఏకగ్రీవం కాగా... 156 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో 733 మంది అభ్యర్థులు పోటిలో ఉన్నారు.

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో 3 వార్డు స్థానాలకు గాను సింగిల్ నామినేషన్లు వచ్చిన కారణంగా ఎన్నికలు జరగటం లేదు. సింగిల్ నామినేషన్లు దాఖలు చేసిన వారు కూడా విత్ డ్రా చేసుకున్నారు. 5 పంచాయతీల్లో సింగిల్ నామినేషన్లు రావడం, 6 పంచాయతీల్లో నామినేషన్లు వేసిన వారు విత్‌డ్రా చేసుకొవటంతో 11 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. లక్షల్లో వేలంపాట పాడడంతో పాటు గ్రామాలలో అభివృద్ధి పనులు చేస్తామని నాయకులు హామీలు ఇవ్వడంతో 11 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో కామారెడ్డి జిల్లాలో 11 గ్రామపంచాయితీలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ధ్రువీకరణ చేశారు.

ఏకగ్రీవాల తరువాత ఎన్ని స్థానాలు మిగిలి ఉన్నాయనే అంశంపై ఇప్పుడు అభ్యర్థులకు స్పష్టం రాగా.... ఈనెల 11న జరిగే ఎన్నికలు ఎవరిని గెలిపిస్తాయో నిర్ణయిస్తాయి. ఎన్నికల కోసం వేచి చూసి... ఎవరు నెగ్గుతారో చూద్దాం.

Show Full Article
Print Article
Next Story
More Stories