Kamareddy Municipal Results 2026: కామారెడ్డిలో కాంగ్రెస్ జోరు: బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలు కైవసం.. చెరో 10 వార్డుల్లో ‘హస్తం’ విక్టరీ!

Kamareddy Municipal Results 2026: కామారెడ్డి జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది.

Arun Chilukuri
Published on: 13 Feb 2026 11:54 AM IST
Kamareddy Municipal Results 2026:  కామారెడ్డిలో కాంగ్రెస్ జోరు: బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలు కైవసం.. చెరో 10 వార్డుల్లో ‘హస్తం’ విక్టరీ!
X

Kamareddy Municipal Results 2026: కామారెడ్డి జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా బిచ్కుంద మరియు ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రభంజనం సృష్టించి మున్సిపల్ పీఠాలను దక్కించుకున్నారు. రెండు మున్సిపాలిటీల్లోనూ ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు గట్టి షాక్ తగిలింది.

బిచ్కుంద ఫలితాలు:

బిచ్కుంద మున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.

కాంగ్రెస్: 10 వార్డులు

బీఆర్ఎస్: 01 వార్డు

ఇతరులు: 01 వార్డు

12 స్థానాల్లో 10 గెలుచుకోవడంతో బిచ్కుంద పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమైంది.

ఎల్లారెడ్డి ఫలితాలు:

ఎల్లారెడ్డిలోనూ ఇదే తరహా ఫలితాలు పునరావృతమయ్యాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

కాంగ్రెస్: 10 వార్డులు

బీఆర్ఎస్: 01 వార్డు

ఇతరులు: 01 వార్డు

మొత్తం 12 వార్డుల్లో 10 చోట్ల విజయం సాధించి ఎల్లారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

ఈ రెండు మున్సిపాలిటీల్లో భారీ విజయం సాధించడంతో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story