Kamareddy: రోడ్డు కోసం సొంత ఇంటిని కూల్చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే

Kamareddy MLA Who Demolished His Own House For Road Extension
x

Kamareddy: రోడ్డు కోసం సొంత ఇంటిని కూల్చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే

Highlights

Kamareddy: పెరిగిన రద్దీ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు

Kamareddy: రోడ్డు విస్తరణ కోసం కామారెడ్డి ఎమ్మెల్యే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన ఇంటిని కూల్చి వేసుకున్న ఘటన చోటు చేసుకుంది. రోడ్డు విస్తరణకు తన ఇల్లు అడ్డుగా ఉండడంతో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి తన పాత ఇంటిని స్వచ్ఛందంగా కూల్చి వేసుకున్నారు. కామారెడ్డి పాత బస్టాండ్ నుంచి అడ్లూరు వైపు వెళ్లే మార్గంలో ఎమ్మెల్యేకు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇల్లు ఉంది. పాత బస్టాండ్- అడ్లూర్ రోడ్డు మార్గంలో రోజురోజుకి పెరిగిన రద్దీ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

రోడ్డు విస్తరణకు తన ఇల్లు అడ్డుగా ఉందని భావించిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అధికారుల సమక్షంలో ఇంటిని కూల్చి వేసుకున్నారు. అంతకు ముందు ఆర్ అండ్ బి, మున్సిపల్, టౌన్ ప్లానింగ్, ట్రాన్స్కో అధికారులతో చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇదే రోడ్డు మార్గంలో మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ నివాసంతో పాటు రెండు సినిమా థియేటర్లు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories