కామారెడ్డి జిల్లాలో మిస్సింగ్ కేసు విషాదాంతం

X
Highlights
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో అదృశ్యంపై నెలకొన్న మిస్టరీ విషాదంగా ముగిసింది. నిన్న మత్తమాలలో మిస్ అయిన ...
Arun Chilukuri4 Nov 2020 6:17 AM GMT
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో అదృశ్యంపై నెలకొన్న మిస్టరీ విషాదంగా ముగిసింది. నిన్న మత్తమాలలో మిస్ అయిన రెండేళ్ల పాప సౌమ్య మృతదేహం లభ్యమైంది. నిజాంసాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతంలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. అదృశ్యమైన పాప మృతదేహంగా కనిపించటంతో హత్య కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి విగతజీవిగా కనిపించటంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తమ పాప ఇక రాదనే వార్తతో కన్నీరుమున్నీరవుతున్నారు కుటుంబసభ్యులు.
Web TitleKamareddy: Missing baby found dead
Next Story