కామారెడ్డి జిల్లా కౌలాస్ నాల ప్రాజెక్ట్‌కు భారీగా వరద

Kamareddy: భారీ వర్షం కారణంగా మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి కౌలాస్ నాల ప్రాజెక్ట్‌లోకి పోటెత్తిన వరద.

Sriveni Erugu
Updated on: 10 July 2022 11:29 AM IST
Kamareddy district Koulas Nala project heavily flooded
X

కామారెడ్డి జిల్లా కౌలాస్ నాల ప్రాజెక్ట్‌కు భారీగా వరద

Kamareddy: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ నాల ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. భారీ వర్షం కారణంగా మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి కౌలస్ నాల ప్రాజెక్ట్‌లోకి భారీ స్థాయిలో వరద నీరు పోటెత్తుతుంది. దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసి 1096 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రవాహం అధికంగా ఉండటంతో.. జుక్కల్, పెద్దకొడప్గల్, బిచ్కుంద, మద్నూర్, బీర్కూర్ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రాజెక్ట్ వద్ధ పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story