3నెలల్లో మూడుసార్లు పెళ్లి.. కల్యాణలక్ష్మి నిధుల గోల్‌మాల్..

3నెలల్లో మూడుసార్లు పెళ్లి.. కల్యాణలక్ష్మి నిధుల గోల్‌మాల్..
x
Highlights

ప్రభుత్వ పథకాలు పేదలకు అండగా నిలుస్తాయి. బతుకుపై భరోసా కల్పిస్తాయి. కానీ కొందరు అవినీతిఅధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అధికారులు, బ్రోకర్లు...

ప్రభుత్వ పథకాలు పేదలకు అండగా నిలుస్తాయి. బతుకుపై భరోసా కల్పిస్తాయి. కానీ కొందరు అవినీతిఅధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అధికారులు, బ్రోకర్లు కమ్మక్కై పేదలకు అందాల్సిన సొమ్మును దారి మళ్లిస్తున్నారు. అవినీతికి కాదేది అనర్హం అన్నట్లు రెచ్చిపోతున్నారు. పేదల కన్నీళ్లను తూడ్చుతున్న కల్యాణిలక్ష్మి నిధులను కూడా వదలడం లేదు. ఆదిలాబాద్‌ జిల్లాలో కల్యాణలక్ష్మి నిధులు నిత్యం దారిమళ్లుతూనే ఉన్నాయి.

ఆదిలాబాద్ జిల్లాలోని అవినీతి అధికారులు అందినకాడికి దోచుకుంటున్నారు. బోగస్ పేర్ల సృష్టించి, లబ్ధిదారులకు దక్కాల్సిన సొమ్మును అప్పనంగా మింగేస్తున్నారు. ఆర్డీవో ఆఫీస్‌లో విధులు నిర్వర్తించే సీనియర్ అసిస్టెంట్ నదీమ్ బోగస్ పేర్లను సృష్టించి కల్యాణలక్ష్మి నిధుల గోల్‌మాల్‌కు తెరలేపాడు.

నదీమ్ అక్రమంగా 24 లక్షల కల్యాణలక్ష్మి నిధులను కాజేసినట్లు అధికారుల విచారణలో తేలింది. బోథ్‌లో 9 మంది, గుడిహథ్నూర్‌లో 15 మంది బోగస్ పేర్లను సృష్టించి కల్యాణలక్ష్మి నిధులను దారిమళ్లించాడు. ఇవికాకుండా మరో 2వందల మంది కల్యాణ లక్ష్మి నిధుల గోల్‌మాల్ అయినట్లు అరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై కూడా అధికారులు సీరియస్‌గా విచారణ చేపడతున్నారు.

మండగడ గ్రామానికి చెందిన గంగుభాయి కూతురు వివాహం జరిగి రెండేళ్లయింది. అయినా కల్యాణలక్ష్మి నిధులు మంజూరుకాలేదు. ఆఫీస్‌ల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేదు. ఇక మూడు రోజుల క్రితం ఆర్డీవో ఆఫీస్‌లో అడిగితే పదినెలల క్రితమే చెక్కు మంజూరయ్యిందని డ్రా కూడా చేసుకున్నారని చెప్పేశారు. తనకు రావాల్సిన సొమ్ము ఎవరో అక్రమార్కులు మింగేశారని బాధితులు వాపోతున్నారు. పేదల కన్నీళ్లు తుడిచే కల్యాణలక్ష్మి పథకాన్ని అవినీతి అధికారులు కాసులు కురిపించే వృక్షంగా మార్చుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అవినీతికి పాల్పపడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories