Nizamabad: స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా క‌ల్వ‌కుంట్ల క‌విత ఏక‌గ్రీవం

Nizamabad: నిజామాబాద్‌ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కల్వకుంట్ల కవిత.

Arun Chilukuri
Published on: 24 Nov 2021 2:55 PM IST
Kalvakuntla Kavitha Unanimously Elected as Nizamabad MLC
X

Nizamabad: స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా క‌ల్వ‌కుంట్ల క‌విత ఏక‌గ్రీవం

Nizamabad: నిజామాబాద్‌ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కల్వకుంట్ల కవిత. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్‌ నామినేషన్‌ను తిరస్కరణ కావడంతో ఆమె ఎమ్మెల్సీగా ఎన్నికయ్యింది. ఫామ్‌ 26లో తప్పులు ఉండటంతో శ్రీనివాస్‌ నామినేషన్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. కాగా నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ పంచాయతీరాజ్‌ చాంబర్‌ తరఫున కోటగిరి శ్రీనివాస్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ పోటీకి దూరంగా ఉన్నాయి. అయితే స్వతంత్ర అభ్యర్థిపై ఫోర్జరీ ఆరోపణలు రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story