MLC Kavitha: కేసీఆర్‌ను కలిసిన కవిత.. పదిరోజులు ఎర్రవెల్లిలోనే మకాం
MLC Kavitha: 6 నెలల తర్వాత తండ్రి కేసీఆర్‌ను కలిసిన కవిత
MLC Kavitha: కేసీఆర్‌ను కలిసిన కవిత.. పదిరోజులు ఎర్రవెల్లిలోనే మకాం
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ వచ్చిన తరువాత ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్‌ను కలిశారు. హైదరాబాద్ నుంచి ఉదయాన్నే బయల్దేరిన ఆమె సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉన్న ఫాంహౌజ్‌కి చేరుకున్నారు. ఆమె వెంట భర్త అనిల్, కుమారుడు కూడా ఉన్నారు. ఆమెకు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. కవితకు బెయిల్ రావడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్.. కవితను చూసిన వెంటనే ఆమెను హత్తుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆమె కేసీఆర్ పాదాలకు నమస్కరించారు.
Next Story




