Kavitha: ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి కల్వకుంట్ల కవిత

*నిజామాబాద్ స్థానిక సంస్థల కోటలో బరిలోకి కవిత *ఇవాళ మధ్యాహ్నం నామినేషన్‌ వేయనున్న కల్వకుంట్ల కవిత

Shilpa
Published on: 23 Nov 2021 7:23 AM IST
Kalvakuntla Kavitha has been Confirmed as an MLC Candidate in Nizamabad Local Bodies Fort
X

ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి కల్వకుంట్ల కవిత(ఫైల్ ఫోటో)

Kavitha: ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి కల్వకుంట్ల కవిత ఖరారు అయ్యారు. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటలో ఆమెను ఎంపిక చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు కవిత నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలోనే ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. త్వరలో ఆమె పదవి కాలం ముగియనుండటంతో గులాబీ అధినేత అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మరోసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవితను బరిలో దింపుతున్నారు.

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో అనర్హత వేటుపడింది. దీంతో ఆ స్థానం ఖాళీ కావడంతో అక్కడి నుంచి కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే ఆమె పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 4తో ముగియనుంది. ఇప్పటికే స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పుడు మళ్లీ అదే స్థానం నుంచి ఆమెకు అవకాశం దక్కింది.

Shilpa

Shilpa

Next Story