ఎమ్మెల్సీగా కవిత విజయం.. మరి రెడీగా వున్న కీలక పదవులేంటి?

ఎమ్మెల్సీగా కవిత విజయం.. మరి రెడీగా వున్న కీలక పదవులేంటి?
x
Highlights

ఆమె గెలిచారు. రికార్డుస్థాయి మెజార్టీ సాధించారు. గ్రాండ్‌గా పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చారు. ఎమ్మెల్సీగా గెలిచి ఓ మెట్టెక్కేసేశారు...ఇక ఆమె నెక్స్ట్ స్టెప్...

ఆమె గెలిచారు. రికార్డుస్థాయి మెజార్టీ సాధించారు. గ్రాండ్‌గా పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చారు. ఎమ్మెల్సీగా గెలిచి ఓ మెట్టెక్కేసేశారు...ఇక ఆమె నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది..? ఉన్నతస్ధాయి పదవి వరించబోతుందని జరుగుతున్న చర్చలో నిజమెంత.? ఆ యూత్ ఐకాన్‌కి ఏ పదవి దక్కబోతోంది? కొత్త ఎమ్మెల్సీని క్యాబినెట్‌లోకి తీసుకుంటే, ఏ మంత్రి...త్యాగానికి సిద్దం అవుతారు..? ఆమె క్యాబినెట్ మంత్రి అవుతారా...? అదే హోదా పదవితో సరిపెడతారా...? కవిత అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్న ఎమ్మెల్సీ కవిత, పొలిటికల్ రోల్ ఎలా ఉండబోతోంది?

నిజామాబాద్ స్ధానిక సంస్థల శాసన మండలి ఉప ఎన్నికల్లో, గ్రాండ్‌ విక్టరీ సాధించారు ముఖ్యమంత్రి కూతురు, కల్వకుంట్ల కవిత. భారీ విజయంతో పొలిటికల్‌ రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కకుండా చెయ్యాలన్న గులాబీ పార్టీ వేసిన స్కెచ్, పుల్ వర్కౌటయ్యింది. కవిత గెలుపుతో టీఆర్ఎస్ పార్టీలో నయా జోష్ నెలకొంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత, ఈనెల 14న ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నారు. కవిత ప్రమాణ స్వీకారం కోసం హడావుడిగా శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేశారనే టాక్, పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత నెక్ట్స్ స్టెప్ ఏంటి?...ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టుకుంటారా?...క్యాబినెట్‌లోకి రావడం ఖాయమా?...లేదంటే అదే హోదా కలిగిన మండలి విప్‌గా బాధ్యతలా?...కవితను వరించబోతున్న ఆ పదవి ఏది?

ప్రస్తుతం క్యాబినెట్‌లో ఖాళీలు లేవట. కవితకు మంత్రి పదవి ఇవ్వాలంటే, క్యాబినెట్ లో కొనసాగుతున్న మంత్రుల్లో, ఎవరో ఒకరు తామంతట తాముగా రాజీనామా చెయ్యాల్సిందేనట. లేదా ఎవరినైనా తొలగించాలట. ఇదంతా ఇప్పటికిప్పుడు జరిగే అవకాశం లేకపోవడంతో, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తరవాతే కవితను క్యాబినెట్‌లోకి తీసుకునే ఛాన్స్ ఉందట.

ఐతే అప్పటి వరకు ఆమెకు ఆ హోదాతో సమానంగా ఉండే ప్రభుత్వ విప్ లేదా, మరో పదవి కట్టబెట్టే అవకాశం ఉందనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. కవిత క్యాబినెట్‌లోకి ఇన్ కావాలంటే ఓ మంత్రి ఔట్ కావాల్సి ఉండటంతో, ఈపాటికే సదరు మంత్రిని పదవీ త్యాగానికి సిద్దంగా ఉండాలనే సంకేతాలు ఇచ్చారట గులాబీ బాస్. సీఎంకు అత్యంత విధేయునిగా ఉండే ఓ మంత్రి, రాజీనామా చేసేందుకు తాను రెడీ అనే సంకేతాలు సైతం ఇచ్చారట. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి, కేటీఆర్ సీఎం అయితే, ఆయన స్ధానంలో కవిత మంత్రిగా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ద్విపాత్రాభినయం చెయ్యబోతున్నారనే మరో టాక్ కూడా గులాబీ పార్టీలో జరుగుతోంది.

కవిత పదవిపై అనేక రకాల చర్చలు జరుగుతున్నా, అధినేత మనస్సులో ఏముందో అంతుచిక్కడం లేదట. జిల్లా ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా కవితను మంత్రిని చెయ్యాలని తీర్మానం చేసి, త్వరలో కేసీఆర్‌కు ఇవ్వాలనే యోచనలో ఉన్నారట. సీఎం తన కూతురు భవిష్యత్ కు ఎలాంటి భరోసా ఇస్తారు? ఏ పదవితో ఆమె సేవలను వినియోగించుకుంటారో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.


Show Full Article
Print Article
Next Story
More Stories