'ఒళ్లు దగ్గర పెట్టుకో..' తాటికొండ రాజయ్యపై కడియం శ్రీహరి ఫైర్‌

Kadiyam Srihari Slams MLA Thatikonda Rajaiah
x

‘ఒళ్లు దగ్గర పెట్టుకో..’ తాటికొండ రాజయ్యపై కడియం శ్రీహరి ఫైర్‌

Highlights

Station Ghanapur: ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వ్యాఖ్యలను ఖండించారు కడియం శ్రీహరి.

Station Ghanapur: ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వ్యాఖ్యలను ఖండించారు కడియం శ్రీహరి. రాజయ్య మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. స్టేషన్ ఘనపూర్ గడ్డ నీ అడ్డా జాగిరి కాదు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో చిల్లర పనులు చిలిపి చేష్టలు పనికిరావన్నారు. తనవల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే.. పార్టీ అధినేతకు చెప్పుకోవాలని, ఇలా బహిరంగ విమర్శలు చేయడం కరెక్ట్‌ కాదని ఆయన సూచించారు. పార్టీలో అందరికీ అవకాశాలు వస్తాయని, ఆ సమయంలో ఎవరైతే మంచి చేస్తారో వాళ్లను ప్రజలు గుర్తించుకుంటారని చురకలు అంటించారు కడియం.

రాజయ్యకు సూటిగా సవాల్ చేస్తున్నాను. స్టేషన్ ఘనపూర్ నీ అడ్డ అయితే పార్టీ ప్రస్తావన లేకుండా స్వచ్ఛంద సంస్థతో సర్వే చేపిద్దాం. ప్రజలు రాజయ్యను కోరుకుంటున్నారా.. శ్రీహరిని కోరుకుంటున్నారా? సర్వే రిపోర్ట్ తేల్చుతుంది. సర్వే రిపోర్టుకు కట్టుబడి ఉంటావా? నా సవాల్‌కు స్పందించు. డొంక తిరుగుడు సమాధానంతో తప్పించుకునే పరిస్థితి వద్దు. నా సవాల్‌కు సిద్ధం కాకపోతే ఎక్కడైనా నా ప్రస్తావన తీసుకురావద్దని వార్నింగ్ ఇస్తున్నా' అని తీవ్ర విమర్శలు గుప్పించారు ఎమ‍్మెల్సీ కడియం శ్రీహరి.

జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్నపెండ్యాలలో కొత్త పింఛన్‌దారులకు ఎమ్మెల్యే రాజయ్య కార్డులు అందజేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో కడియం శ్రీహరి 361 మంది నక్సలైట్లను ఎన్‌కౌంటర్ చేయించారని ఆరోపించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎప్పటికీ తన అడ్డానే అని.. అక్కడ ఎవరినీ కాలు పెట్టనీయనని శపథం చేశారు. రాజయ్య వ్యాఖ్యలపై కడియం శ్రీహరి తీవ్రంగా స్పందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories